SKLM: జిల్లా వ్యాప్తంగా వాహన మిత్ర పథకానికి 15,341 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. వారిలో 13,887 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరి కోసం సుమారుగా 20 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. నేడు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి డ్రైవర్ కి సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.