VKB: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2,68,282 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 1,25,000 మంది రైతులు పత్తిని సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 14 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.