VSP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని సేకరిస్తోంది. అయితే భూములు ఇవ్వలేమంటూ రైతుల పేరుతో YCP బినామీలు కోర్టులో కేసులు వేశారని, వీరిలో చనిపోయిన వారి పేర్లు కూడా ఉన్నాయని TDP నాయకులు ఆరోపిస్తున్నారు. CM చంద్రబాబు సైతం దీనిపై విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలని MLA గంటా, కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను ఆదేశించారు.