ప్రకాశం: కనిగిరి మండలం కలగట్ల గ్రామానికి చెందిన టీడీపి సీనియర్ నాయకుడు గుండాబాతుని బంగారయ్య శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. బంగారయ్య మృతి పట్ల ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంతాపం తెలిపారు. టీడీపీ మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు,, టీడీపీ నాయకులు బారాయిమామ్ తదితరులు బంగారయ్య పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.