గుంటూరులోని గుజ్జనగుండ్ల 3వ లైన్లో సెప్టెంబర్ 29 రాత్రి టైలరింగ్ షాప్తోపాటు రెండు మోటార్ సైకిళ్లు తగలబెట్టిన కేసులో పట్టాభిపురం పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. శ్యామలా నగర్లో మహమ్మద్ అనే వ్యక్తిని ఎస్సై రాజ్ కుమార్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.