SRCL: బోయినపల్లి మండలంలోని కొదురుపాక హైస్కూల్ మైదానంలో ఈనెల 5, 6ల్లో మై భారత్ అండ్ కొదురుపాక స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మై భారత్ వాలంటరీ గంగిపల్లి స్వామికుమార్ తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, బ్యాడ్మింటన్, చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.