ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో కేంద్రం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో 130 ఇళ్లను నిర్మించింది. ఈ ఇంటి నిర్మాణంలో కంకర వినియోగించరు. స్లాబ్‌కు మాత్రమే ఇనుము, ఉక్కు వాడుతారు. ఫ్లైయాష్ ఇటుకలతో గోడలను నిర్మిస్తారు. ఎలాంటి పిల్లర్లు లేకుండా ఒకేసారి 3 అంతస్తులు.. 600 చదరపు అడుగుల వరకు కట్టుకోవచ్చు. రూ. 2 లక్షల ఖర్చుతో 45 రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది.