SKLM: పాతపట్నం మండలంలో శనివారం మహేంద్ర తనయ నదిలో వరద నీరు పెరిగిపోవటంతో కుళాయిల ద్వారా మంచినీటి సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తక్షణమే మేజర్ పంచాయతీలోని అన్ని వార్డులలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.