కృష్ణా: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నదిలోకి విడుదలవుతున్న వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం 2.16 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, శనివారం ఉదయానికి 2 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వరద మరింత పెరుగుతుందేమోనని ఆందోళన చెందిన అధికారులు, స్థానిక ప్రజలు దీంతో ఊపిరి పీల్చుకున్నారు.