సత్యసాయి: మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం ఉదయం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మారువేషంలో ఆకస్మికంగా సందర్శించారు. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి రోగుల పరిస్థితిని తెలుసుకున్న ఆయన, డ్యూటీ డాక్టర్లు సమయానికి హాజరయ్యారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. మారువేషంలో వచ్చిన ఎమ్మెల్యేను గుర్తించిన రోగులు ఆశ్చర్యానికి గురయ్యారు.