టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈరోజు 28వ వసంతంలోకి చేరాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు క్రికెటర్లు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 154 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పంత్.. 5507 పరుగులు చేశాడు. వాటిలో 7 సెంచరీలు ఉన్నాయి. అలాగే.. వికెట్ కీపర్, ఫీల్డర్‌గా 250 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.