కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో కొలువైన శ్రీ జగన్మోహిని కేశవ, గోపాల స్వామిని పాట్న హై కోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం అర్చకులు జడ్జికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.