AP: సోషల్ మీడియాను నియంత్రించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోము కానీ, తప్పుడు పోస్టులతో వ్యక్తిత్వహననం లేదా విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలతో AP బ్రాండ్‌ను చెడగొట్టే ప్రయత్నాలను ఉపేక్షించబోమన్నారు. అన్ని అంశాలను అధ్యయనం చేశాకే చట్టం తీసుకొస్తామని తెలిపారు.