అసోంకు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జుబీన్కు విషమిచ్చి ఉంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సింగర్ మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు.