ASR: ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా పాడేరు డివిజన్ పరిధి 11మండలాల్లో 2,862 మంది, రంపచోడవరం డివిజన్ పరిధి 11మండలాల్లో 1,355మంది ఎంపికయ్యారని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 4,217 వాహనదారులకు రూ.15వేల చొప్పున రూ.6,32,55,000సొమ్మును ప్రభుత్వం జమచేయడం జరుగుతుందన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నేడు ప్రారంభిస్తారని తెలిపారు.