SKLM: జిల్లాలో పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిశాలో వాయుగుండం ఫలితంగా జిల్లాలో భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరిందని తెలియజేశారు. ప్రభావం ఇంకా ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.