AP: కేంద్ర ప్రభుత్వం విశాఖకు దసరా కానుక ప్రకటించింది. జిల్లాలోని తీర ప్రాంత పరిరక్షణకు రూ.222.22 కోట్ల మంజూరుకు అనుమతి ఇచ్చింది. ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమయ్యే ప్రాంతాలకు రికవరీ, రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కింద రూ.200 కోట్లు అందించనుంది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో కలిసి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది.