SRCL: బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర(మిడ్ మానేరు) ప్రాజెక్టు నుంచి శుక్రవారం రాత్రి ఎల్ఎండీకి 850 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి వేయి క్యూసెక్కుల మేర వరద ఇన్ ఫ్లోగా చేరుతోంది. మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటి మట్టం 27.479 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు.