JGL: ధర్మపురి క్షేత్రంలో అశ్వయుజ మాసం ద్వాదశి సందర్భంగా స్థానిక లక్ష్మీ నృసింహ స్వామి, అనుబంధ రామలింగేశ్వ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించారు. భక్తులు అభిషేకాది పూజలు, కుంకుమార్చన, స్వామి వారల నిత్య కళ్యాణం జరిపించి పూజలు చేశారు.