PDPL: సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఈనెల 5న మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆర్జీ 1 యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్ నుంచి న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ ఈ క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పాల్గొనాలనుకునే వారు ఈరోజు ఈ నెల 4 సాయంత్రం లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.