PDPL: మావోయిస్టులుగా అడవుల్లో ఉండి ప్రయోజనం లేదని, ప్రజల జీవన స్రవంతిలోకి రావాలని, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలో మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మను శుక్రవారం రాత్రి పరామర్శించారు. రాజిరెడ్డి లొంగి, వృద్ధ తల్లిని చూసుకోవాలని సూచించారు. లొంగితే రివార్డు, ఉపాధి కల్పన ఉంటుందని వెల్లడించారు.