NZB: దర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి శ్రీకాంత్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో పార్క్ చేసిన బైకును గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. మరుసటి రోజు ఉదయం బైక్ కాలిపోయి ఉండటాన్ని చూసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం ఎస్సై కళ్యాణి తెలిపారు.