NLG: చండూరుకి ఆపేరు చండీకాదేవి పేరు నుంచే ఏర్పడిందని పూర్వీకులు చెబుతున్నారు.1930కి పూర్వం నేటి కనకదుర్గ గుడి వద్ద చండికా యాగం జరిగినట్లు గ్రామ చరిత్ర చెబుతోంది. కనకదుర్గమ్మను అప్పట్లో చండికాదేవిగా కొలిచేవారని ప్రముఖ కవి ఆచార్య కె.వెంకట్ రెడ్డి ధృవీకరించారు. పూర్వం ఇక్కడ దసరా పండుగను కులమతాలకు అతీతంగా ఊరేగింపులు విందు వినోదాలతో ఘనంగా నిర్వహించేవారు.