BPT: వేమూరు సెంటర్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు శనివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించబడింది. ర్యాలీలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని, ఆటో స్వయంగా నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో ఆటో డ్రైవర్లు ప్రజల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.