E.G: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో నష్టపోయామంటున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పేరిట కూటమి సర్కార్ మరో పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టిందని రాజనగరం MLA బత్తుల బలరామకృష్ణ అన్నారు. శనివారం కోరుకొండలో ‘ఆటో డ్రైవర్ సేవా పథకం’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.