KKD: శనివారం సామర్లకోట రైల్వే స్టేషన్లో గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ ప్రెస్‌లు ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. వివరాల్లోకెళ్తే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతదేహం రెండు ముక్కలుగా విడిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం పోలీసులు మీడియాకు వెల్లడించారు.