KMR: విజయదశమి రోజు అర్ధరాత్రి కలకలం రేపిన దాడుల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనకు కారకులైన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు 100 కాల్ వచ్చిందన్నారు.