KRNL: బన్ని ఉత్సవాల్లో మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి జరిగిన కర్రల సమరంలో నలుగురి ప్రాణాలు బలికొనగా, 100 మంది పైగా గాయపడ్డారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట ఒకవైపు, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, బిలేహాల్ మరో వైపు యుద్ధం జరిపి చివరగా నెరణికి గ్రామస్థులు ఉత్సవమూర్తులను దక్కించుకున్నారు.