NTR: దసరా ఉత్సవాలు ముగిసినా, విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రోజుకు 60 వేల నుంచి 70 వేల మంది వరకు భక్తులు వస్తున్నారు. ఈ రద్దీ నేపథ్యంలో భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.