ADB: బజార్హీత్నూర్ మండలంలోని చింతల్సంగ్వి ప్రధాన రహదారి ప్రయాణికులను భయపెడుతోంది. వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతిని, పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతూ ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు తక్షణమే రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు కొరుతున్నారు.