W.G: నరసాపురం వశిష్ట గోదావరిలో వరద ఉదృత కొనసాగుతుంది. ఎగువ నుంచి లక్షల క్యూసెక్కులు వరద నీటిని వశిష్ట గోదావరిలోకి విడిచిపెట్టడంతో నరసాపురం వద్ద గోదావరి నిండుకుండలా మారింది. 6 రోజులుగా రేవుల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టలేదు. దీంతో స్నానాలకు అనుమతించడం లేదు. ఇటు ఉభయగోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పంటు రాకపోకలు శుక్రవారం కూడా నిలిచాయి.