TG: భద్రాద్రి జిల్లాలో స్థానిక సంస్థల విధుల కేటాయింపులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చనిపోయినవారికి, రిటైర్ అయినవారికి స్థానిక ఎన్నికల విధులు కేటాయించడమే కాకుండా.. ట్రాన్స్ఫర్పై వెళ్లిన టీచర్లకు పాత ప్లేసులో డ్యూటీలు వేశారు. 6 నెలల కింద రెడీ చేసిన లిస్టును అప్ డేట్ చేయకుండానే డ్యూటీలు కేటాయించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.