BPT: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగేలా వివిధ శాఖాధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇంటింటికి వెళ్లి GST తగ్గింపు, ఆదాపై ప్రజలకు వివరించాలని అన్నారు. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో గ్రామ సచివాలయాల అధికారులు చొరవ తీసుకుని సహకరించాలని కోరారు.