అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామం జాండ్రపల్లెలో విజయదశమి సందర్భంగా చౌడేశ్వరి అమ్మవారికి మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి గురువారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంపాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.