ప్రకాశం: కనిగిరిలోని జగనన్న కాలనీలో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను కోరారు. ఒంగోలులో శుక్రవారం జరిగిన దిశ కమిటీ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ పాల్గొని జగనన్న కాలనీలో సమస్యలను ప్రస్తావించారు. కాలనీలో రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.