E.G: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వేములూరుకు చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల భీమా చెక్కును ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు ఈ భీమా సదుపాయాన్ని కల్పించారన్నారు. చెక్కును కొవ్వూరు టీడీపీ ఆఫీసులో అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.