SKLM: హిరమండలం గ్రామపంచాయతీలో శుక్రవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ సుందరమ్మ మాట్లాడుతూ.. గ్రామంలోని కాలువలు, మురుగునీరు, వీధిలైట్లు వంటి సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సభలో ఎంపీటీసీ శంకర్రావు, ప్రతినిధి రామకృష్ణ, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.