HYD: నగరంలో అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. జన సంచారం, ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉన్నట్లు HUMTA డైరెక్టర్ జీవన్ బాబు తెలిపారు. సికింద్రాబాద్ ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ఉండే వంతెనతో పాటు చుట్టుపక్కల మరో రెండు కీలక బస్టాండ్లను అనుసంధానించేలా స్కై వాక్ డిజైన్ చేసినట్లుగా ఆయన తెలిపారు.