TPT: అపోహలు, ఊహాగానాలు నమ్మవొద్దని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. వివిధ రాష్ట్రాలలో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దన్నారు.