KMM: కల్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అందుకు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాగ్దానాలు చేసి మోసం చేసిందని పేర్కొన్నారు.