AKP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈనెల 4వ తేదీన కోటవురట్ల మండలంలో పర్యటించనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షులు లింగన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా ఉదయం 8.30 గంటలకు ఎండపల్లి వద్ద తారు రోడ్డు పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే లింగాపురం నుంచి నీలిగుంట వరకు నిర్మించే రహదారి పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు.