KNRL: స్మశానాల్లో పని చేసే వళ్ళకాడు కాటికాపరుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 6న కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఎస్జికేఎస్ జిల్లా అధ్యక్షుడు బి. తిక్కప్ప తెలిపారు. శుక్రవారం ఆదోనిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నియామకాలు, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా వంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.