AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీలో 20 అంశాలపై చర్చించనున్నారు. రాజధానిలో పెండింగ్ ప్రాజెక్టులు, భూసేకరణపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో జీఎస్టీ కార్యక్రమాలకు సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.