PLD: జీఎస్టీ 2.0 తగ్గింపు పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల ర్యాలీ అచ్చంపేటలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ప్రసంగించారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల అన్నదాతలు మరియు సాధారణ ప్రజలకు ఊరట లభిస్తోంది అన్నారు.