ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మాజీ మంత్రి జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని రామన్న నివాసంలో కలిసి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వారు ఆయనకు వివరించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన నాయకులకు సూచించారు.