KNR: హుజురాబాద్ బస్టాండ్లో దసరా పండుగ ప్రభావంతో ఇవాళ ప్రజలు తిరుగు ప్రయాణంతో బస్టాండ్ ప్రయాణీకులతో కిక్కిరిసి పోయింది. రేపటి నుంచి పాఠశాలలు, హాస్టల్ ప్రారంభమవుతున్న దృష్ట్యా సాయంత్రం వరకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. బస్సుల కొరతతో బస్సుల కోసం గంటల పాటు ఎదురుచూపులు తప్పటం లేదని వాపోతున్నారు. అదనపు బస్సులు కేటాయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.