విశాఖలో వరుస స్నాచింగ్ కేసుల్లో నిందితుడు, కరుడుగట్టిన బబేరియా గ్యాంగ్ సభ్యుడు ధర్మేంద్ర కుమార్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ క్రైమ్ పోలీసులు అతని ద్వారా 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించారు. వరుస దొంగతనాలతో భయభ్రాంతులకు గురైన ప్రజలకు ఊరటనిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.