KNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళల స్థానాలు విపరీతంగా పెరగనున్నాయి. 16,42,542 మహిళా ఓటర్లుండగా.. ఇందులో 30 ZPTC స్థానాలకు, 30 MPP స్థానాలకు, 323 MPTC స్థానాలకు, 615 గ్రామపంచాయతీలకు, 6,463 వార్డు సభ్యుల స్థానాలకు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేయడంతో మహిళ ఓట్లు కీలకం కానున్నాయి.