కొలంబియా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘X’ వేదికగా దేశీయ సంస్థలను అభినందించారు. బజాజ్, హీరో, TVS సంస్థలు కొలంబియాలో రాణించడం గర్వంగా ఉందని కొనియాడారు. ‘భారత్లో ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిఒక్కరికీ చోటు కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది’ అని అన్నారు.