TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC సిద్ధమైంది. MPTC, ZPTC ఎన్నికలకు 37,652, పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా 1,18,547 ఉన్నాయని తెలిపింది. ZPTC ఎన్నికల నిర్వహణకు దశల వారీగా 651 మంది, MPTC ఎన్నికలకు 2,337 మంది ROలు, 2,340 మంది AROలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది రెడీగా ఉన్నారని పేర్కొంది.